ఆరవసారి “రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం” సాధించిన తెలుగుబిడ్డ సందీప్ చక్రవర్తి

ఏపీ స్టేట్ బ్యూరో,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ జీ.వి. సందీప్ చక్రవర్తి. ఆరోసారి రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం (పిఎంజి) అందుకుని అరుదైన ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధికసార్లు ఈ పతకం పొందిన కొద్దిమంది అగ్ర ఐపీఎస్ అధికారులలో ఆయన ఒకరిగా నిలిచారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకం లభించింది. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు.
కుటుంబ నేపథ్యం, విశేషాలు..
సందీప్ చక్రవర్తి తండ్రి డాక్టర్ జీ.వి.రామగోపాలరావు, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీఎస్‌ఆర్‌ఎంవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లి పీసీ రంగమ్మ కూడా ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. విద్యావంతులైన ఈ దంపతులు తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు.సందీప్‌కు ఒక అన్నయ్య (జీవీ ప్రమోద్ చక్రవర్తి), ఒక చెల్లెలు (జీవీ సౌజన్య) ఉన్నారు.
డాక్టర్ నుంచి ఐపీఎస్‌గా
సందీప్ చక్రవర్తి జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. కర్నూలు నగరంలోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన, హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 2005లో కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టరేట్ పట్టా పొందారు.డాక్టర్‌గా పరిమిత సంఖ్యలో ప్రజలకు మాత్రమే సేవ చేయగలమని భావించిన ఆయన, సివిల్స్ సాధిస్తే తన సేవలను విస్తృతం చేయవచ్చని తండ్రి ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ దశలో 20 మార్కుల తేడాతో విఫలమైనప్పటికీ, మొక్కవోని పట్టుదలతో చదివి ఎస్సీ కేటగిరీలో 786వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.
విశిష్ట సేవల గుర్తింపు..
సందీప్ చక్రవర్తి తన ఐపీఎస్ కెరీర్‌లో అనేక పురస్కారాలు అందుకున్నారు.వాటిలో 6వ రాష్ట్రపతి పోలీసు గ్యాలంటరీ పతకం (పి ఎం జి)కశ్మీర్ లోయలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆయన చూపించిన అపారమైన ధైర్యానికి గుర్తింపు.నాలుగు సార్లు జమ్మూ అండ్ కశ్మీర్ పోలీసు గ్యాలంటరీ పతకాలు.ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్, ఇంకా అనేక ఇతర ప్రతిష్టాత్మక పతకాలు సాధించారు.సందీప్ చక్రవర్తి వంటి అధికారులు తమ సాహసోపేతమైన విధులతో, వ్యక్తిగత సంకల్పంతో దేశరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది కర్నూలు నగరానికి,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత గర్వకారణం అంటూ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ సందీప్ చక్రవర్తికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం: ప్రయాణికులు సురక్షితం

విశాఖపట్నం ఐఏషియ న్యూస్: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లభించింది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *