న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ ఎమ్మెల్సీలు గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకం రద్దు చేస్తూ సుప్రీం తీర్పువెలువరించింది. తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందనివెల్లడించింది. తమ నియామకం చేపట్టకుండా ఈ ఇద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించటంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీనిపైన హైకోర్టు,సుప్రీం కోర్టుల్లో సుదీర్ఘ విచారణ జరిగింది. కాగా, బుధవారం కోదండరాం, ఆలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ తుది తీర్పు కోసం సెప్టెంబర్ 17వ తేదీకి సుప్రీం కేసు వాయిదా వేసింది.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావణ్, సత్యానారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నాటి కేబినెట్ ఎంపిక చేసి సిఫారసు చేసింది.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గవర్నర్ కోటాలో కోదండరామ్, ఆమీర్ అలీఖాన్ నియామకమైన విషయం తెలిసిందే. ఇద్దరిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది.అయితే, దీన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రావణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ మేరకు ఆయా పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఎమ్మెల్సీలుగా కోదండరామ్, ఆలీఖాన్ ప్రమాణస్వీకారాన్ని తప్పుపట్టింది. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది.ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహత ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై దాసోజు శ్రావణ్ స్పందించారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత స్పందిస్తానని.. ఆ ఇద్దరి ఎమ్మెల్సీల నియామకాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు రద్దు చేసిందని చెప్పుకొచ్చారు.దీంతో సుప్రీం వచ్చే నెల 17న ఇచ్చే తుది తీర్పుకు అనుగుణంగా ఈ ఇద్దరి ఎమ్మెల్సీల విషయంలో తదుపరి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
Authored by: Vaddadi udayakumar