బాలకృష్ణ చిరంజీవి వివాద పరిష్కారానికి ఆచితూచి అడుగులు

రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో చిరంజీవి అభిమానుల సమావేశం

ఏపీ స్టేట్ బ్యూరో ,ఐఏషియ న్యూస్:  మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు. చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ-పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్. ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. దీనిపైన కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలుమొదలయ్యాయి.
వ్యాఖ్యల కలకలం
అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి స్పందన సైతం అదే స్థాయిలో ఉంది. దీంతో.. సభలో కామినేని – బాలకృష్ణ మధ్య సంవాదం జరగాల్సింది కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సభలో చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన పవన్ – నాగబాబు స్పందించ లేదు. దీని పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అటు అన్నయ్య చిరంజీవి.. ఇటు కూటమి నేత బాలకృష్ణ కావటంతో పవన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.
కీలక మలుపు
అటు చిరంజీవి ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసనలకు సిద్దం అవుతున్నారు.ఆదివారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో, మెగా- నందమూరి కి దగ్గరగా ఉండే ఇద్దరు ముఖ్యులు రంగంలోకి దిగారు. చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించలేక… కూటమి మిత్రపక్షంగా ఓపెన్ గా వ్యతిరేకించలేక పవన్ క్యాంప్ తర్జన భర్జన పడుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్లినా.. మరో వైపు నుంచి సమస్య తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా బాలకృష్ణ వ్యాఖ్యలు అటు సినీ రాజకీయ రంగాల్లో పెను దుమారాన్ని రేపింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

26 నుంచి “భారత్ గౌరవ్” ప్రత్యేక పర్యాటక రైలు ప్రారంభం

ప్రత్యేక ప్రతినిధి,ఐఏషియ న్యూస్: జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను ఒకేసారి చుట్టి రావాలి అనుకునే వారికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *