Recent Posts

హెచ్ వన్ బి వీసా విషయంలో ట్రంప్ నిర్ణయం పై సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం

హైదరాబాద్ ,ఐఏషియ న్యూస్: హెచ్ 1 బి వీసా విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న …

Read More »

ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగి ఉన్న వారికి శ్వేతసౌధం తీపికబురు

వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్:  కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము ఉంటుందన్న శ్వేత సౌధం ప్రకటించింది.కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్లు రుసుము ఉంటుందని వెల్లడించారు.ఇప్పటికే వీసా ఉన్నవారు లక్ష డాలర్ల రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.కొత్త వీసాదారులకే రుసుము ఉంటుందని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు.ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు, పునరుద్దరణలకు కొత్త రుసుము వర్తించదని పేర్కొన్నారు.విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులు వెంటనే అమెరికాకు రావాల్సిన అవసరం లేదన్నారు.హెచ్1బీ వీసాల్లో దాదాపు …

Read More »

అర్ధరాత్రి నిండు గర్భిణీని ఆదుకున్న108 సిబ్బంది

టెక్కలి 108 లో గిరిజన మహిళ సుఖప్రసవం టెక్కలి(శ్రీకాకుళం),ఐఏషియ న్యూస్:  మందస మండలం బంసుగాం గిరిజన గ్రామానికి చెందిన సవర రుక్మిణి మొదటి కాన్పు పుట్టినొప్పులతో శుక్రవారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడి నుంచి అర్ధరాత్రి టెక్కలి ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. గర్భిణీ ప్రసవంకి సహకరించక పోవడంతో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ కి రిఫర్ చేశారు. టెక్కలి 108 లో రిమ్స్ కి తీసుకువెళ్తుండగా కోటబొమ్మాళి మండలం పాకివలస గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ …

Read More »