ఈ జాబితాలో హైదరాబాదుకు దక్కని చోటు
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ప్రపంచవ్యాప్తంగా సురక్షిత దేశాలు, నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ సంస్థ నంబియో సేఫ్టీ ఇండెక్స్ తాజాగా 2025 సంవత్సరానికి సంబంధించిన సేఫ్టీ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో ప్రజల భద్రత, నేరాల తీవ్రత, మహిళలపై దాడుల రేటు,దొంగతనాలు,మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలను ఆధారంగా తీసుకుంది. ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్ లో టాప్-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటకరాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది.అలాగే రెండో స్థానంలో గుజరాత్ లోని వడోదర నిలిచింది.జాబితాలో అహ్మదాబాద్ మూడో స్థానంలో నిలిచింది. అదే రాష్ట్రానికి చెందిన సూరత్ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక ఈ జాబితాలో రాజస్థాన్ రాజధాని జైపూర్ ఐదో స్థానంలో మహారాష్ట్ర రాజధాని నవీ ముంబై ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.మహారాష్ట్రలోని పూణె తొమ్మిదో స్థానంలో అలాగే చండీఘడ్ 10వ స్థానంలో నిలిచింది. ఇక భారత రాజధాని దిల్లీ మాత్రం చివరి స్థానంలో ఉంది.అయితే టాప్ 10 స్థానాల్లో హైదరాబాద్ కు చోటు దక్కక పోవడం గమనార్హం. ఇక అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది.ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 55.8 స్కోర్ సాధించింది.
Authored by: Vaddadi udayakumar