మోడీ తర్వాత స్థానం జూనియర్ ఎన్టీఆర్‌ దే

పాపులర్ వ్యక్తుల జాబితా విడుదల చేసిన ఎక్స్ సంస్థ

బిజినెస్ డెస్క్,ఐఏషియ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌లు, చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖుల గురించి నెటిజన్లు నిరంతరం మాట్లాడుకుంటుంటారు.తాజాగా, ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చర్చ జరిగిన సెలబ్రిటీల జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేయగా,అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్ర స్థానంలో నిలిచారు.అయితే, ఆయన తర్వాత ఎన్టీఆర్ నిలవడం ఆయన క్రేజ్‌కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు.ఆగస్టు 14న ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రం విడుదల కావడమే ఈ భారీ చర్చకు ప్రధాన కారణం. సినిమా విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన భారీ బజ్‌తో ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ లో విస్తృతంగా చర్చ జరిగింది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆయన వ్యక్తిగత క్రేజ్ మాత్రంతగ్గలేదనిఈర్యాంకింగ్,నిరూపించింది.మూడవ స్థానంలో తమిళ స్టార్, టీవీకే అధినేత ఇళయదళపతి విజయ్ నిలిచారు.తమిళనాడులో ఆయన రాజకీయ కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉండటమే దీనికి కారణం.ఇక నాలుగవ స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ (5వ స్థానం), రాహుల్ గాంధీ (6వ స్థానం), విరాట్ కోహ్లీ (7వ స్థానం), సూపర్‌స్టార్ మహేష్ బాబు (8వ స్థానం), మహేంద్ర సింగ్ ధోని (9వ స్థానం), సూపర్‌స్టార్ రజినీకాంత్ (10వ స్థానం) నిలిచారు.ఈ జాబితాలో ఎన్టీఆర్,మహేష్ బాబు వంటి ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ఉండటం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.ఎన్టీఆర్ సాధించిన ఈ ఘనత ఆయన అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ప్రసారభారతి మాజీ సీఈవో కె.ఎస్.శర్మ అనారోగ్యంతో మృతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్:  ప్రసారభారతి మాజీ సీఈవో కంభంపాటి సుబ్రహ్మణ్య శర్మ (కె ఎస్ శర్మ)(80) శనివారం హైదరాబాద్ లో తుది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *