తిరుమల,ఐఏషియ న్యూస్: టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణును టీటీడీబోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారంఉత్తర్వులు జారీచేసింది. 29 మంది సభ్యులతో గత ఏడాది టీటీడీ నవంబర్ లో బోర్డు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.అయితే ఈ సభ్యుల్లోసుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్ దత్తును సభ్యునిగా నియమించగా ఆయన ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. అందుచేత ఆ సభ్యుని తొలగించి ఆ సభ్యుని స్థానంలోట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా సుదర్శన్ వేణును నియమించింది.ఈయనకు గతంలోనూ తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈయన త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు.
Authored by: Vaddadi udayakumar