సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహగిరిపై మంగళవారం సాయంకాలం వేళలో శ్రీ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీవైష్ణవకృష్ణజన్మాష్టమి పర్వదినమును పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు సహాయ నిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలోఆలయ స్థానాచార్యులు డాక్టర్.టి పి రాజగోపాల్, ప్రధానార్చకులు శ్రీనివాసచార్యులు, సీతారామాచార్యులు వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందంచే సింహగిరిపై అత్యంత వైభవముగా ఉట్ల ఉత్సవం వేణుగోపాల అలంకరణలో జరిగింది. రాజగోపురం ఎదురుగాగల ప్రాంగణము నందు ప్రతి సంవత్సరం వలె యాదవ వంశమునకు చెందిన భక్తునిచే ఉట్టిని కొడుతూ ప్రధాన అర్చకులు గొడవర్తి సీతారామాచార్యులు ఉట్టిని లాగుతూ సాంప్రదాయపద్ధముగా ఈ కార్యక్రమం జరిగింది తదుపరి వేణుగోపాల ఆకారంలో ఉన్న స్వామిని తిరువీధి జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె .తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి కె.వెంకటేశ్వరావు,స్థానాచార్యులు, ఆలయ అర్చకులు వేద పండితులు, అధ్యాపకులు,ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar