న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగంలోని 63వ అధికరణంలో ఉపరాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది. ఈ పదవికి సంబంధించి భారత్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని మరే పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోను లేని అంశం ఇది. పెద్ద ప్రజాస్వామ్యాలలో, అమెరికాలో మాత్రమే ఈ పదవి ఉంది.అయితే భారత్, అమెరికాలలో ప్రజాస్వామ్య విధానాలు వేరు (భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం,అమెరికాలో అధ్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ఉన్నాయి) అందుచేత ఉప రాష్ట్రపతి విధులకు,అమెరికా ఉపాధ్యక్షుడి విధులకు చాలా తేడా ఉంది.ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆర్టికల్ 63 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి.అతను ఐదేళ్ల పదవీకాలం పాటు సేవలందిస్తారు.అయితే పదవీకాలం ముగిసినప్పటికీ,వారసుడు పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు పదవిలో కొనసాగవచ్చు. ఇప్పటివరకు 14 మంది ఉపరాష్ట్రపత్తులుగా తమ బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం మంగళవారం జరిగిన ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఆయన 452 ఓట్లు సాధించారు. ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే లభించాయి. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా పలువురు అభినందనలు తెలియజేశారు. మన దేశానికి ఉప రాష్ట్రపతులుగా పని చేసిన 14 మంది వివరాలు పాఠకుల కోసం ఐఏషియ న్యూస్ అందిస్తోంది.
Authored by: Vaddadi udayakumar