విజయవాడ,ఐఏషియ న్యూస్: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హుండీని. గురువారంఆలయం అధికారులు లెక్కింపు చేపట్టారు. ఈ లెక్కింపుల్లో మొత్తం రూ.4.50 కోట్లకుపైగా కానుకలు, ఇతర ఆభరణాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో గత 31 రోజుల్లో వచ్చిన హుండీ ఆదాయాన్ని తాజాగా అధికారులు లెక్కించారు. ఇక డబ్బుతోపాటు, బంగారు నగలు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ..హుండీలో లభించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.ఇక విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ దుర్గగుడి ఆలయ ఈవో నాయక్ స్పష్టం చేశారు.తాజాగా నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం నగదు రూ.4,57,31,258 వచ్చినట్లు ఆలయ ఈవో వెల్లడించారు. ఇక బంగారం సహా ఇతర ఆభరణాలు, విదేశీ కరెన్సీ మొత్తం కలిపి ఇందులోనే ఉందని తెలిపారు. ఇక 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.650 కిలోల వెండి ఆభరణాలు భక్తులు హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఇంగ్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, మలేషియా, యూరప్, కువైట్, హాంకాంగ్, కెనడా దేశాలకు చెందిన కరెన్సీలు లభించినట్లు బెజవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు వెల్లడించారు.మొత్తం 14 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ హుండీలో లభ్యమైనట్లు పేర్కొన్నారు.
Authored by: Vaddadi udayakumar