గణనాథునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు

టెక్సాస్,ఐఏషియా ప్రత్యేక ప్రతినిధి: వినాయకచవితి సందర్భంగా ఇర్వింగ్ టెక్సాస్ లో గల డి ఎఫ్ డబ్ల్యు గణపతి ఆలయంలో నెలకొన్న గణనాధునికి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయానికి భక్తులు చేరుకుని విఘ్నేశ్వరుని దర్శించుకుని నామాలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వినాయక స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణేష్ హోమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

వినాయక చవితి సందర్భంగా గణపతి హోమం నిర్వహణ

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

అంగరంగ వైభముగా సింహాద్రినాధుని నిత్య కల్యాణం

సింహాచలం,ఐఏషియ న్యూస్:  ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *