సుజాతనగర్(విశాఖపట్నం),ఐఏషియ న్యూస్: 97వ వార్డు పరిధిలో గల చినముసిడివాడ ఉడా కాలనీలో వినాయక చవితి సందర్భంగా నెలకొల్పిన వినాయక ప్రతిమను సోమవారం ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.గత ఐదురోజులుగా వినాయకునికి నిత్యపూజలు స్థానిక కాలనీవాసులు నిర్వహించారు. ప్రసాదాలు నివేదన చేశారు. సోమవారం అన్న ప్రసాద వికరణ నిర్వహించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి సరిపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వినాయక నిమజ్జనోత్సవం ముఖ్యకార్యకర్తలు సంజీవి ,సత్యనారాయణ,వెంకట్, కమల్, తేజ, చరణ్, వంశీ, ఎం వెంకట్రావు, శ్రీమతి సుధారాణి, విన్నకోట రాము, బివి రామారావు, పి సదానంద రావు కేవి ప్రసాదరావు, గొంప ప్రభ, పి గోవిందరావు,విగ్రహ దాతలు మణికంఠఅవినాష్,టి.రంగనాథ్ తో పాటు కాలనీ నివాసితులు మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar