నిమజ్జనానికి 50 వేల విగ్రహాలు రానున్నట్లు అధికారులు అంచనా
హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు.303 కిలోమీటర్ల మేర కొనసాగనున్న గణేష్ శోభాయాత్రలు. నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జీహెచ్‌ఎంసీ. 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.30 వేల మందితో పోలీసు బందోబస్తు.160 యాక్షన్ టీంలు.నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు. 72 కృత్రిమ కొలనులు..134 క్రేన్లు,259 మొబైల్ క్రేన్లు. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం.. 200 మంది గజ ఈతగాళ్లు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది.l56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు.శనివారం 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అటు పోలీసు, ఇటు జిహెచ్ఎంసి యంత్రాంగం అప్రమత్తమయ్యారు.
Authored by: Vaddadi udayakumar