అమరావతి,ఐఏషియ న్యూస్: ఆంధ్రప్రదేశ్ కోసం 11 కొత్త లైన్ లు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మొత్తం పొడవు -1,960 కి.మీ పరిధిలో26 ప్రాజెక్టులకు డి పి ఆర్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. కీలక మార్గాలు ఈ ప్రాంతాల గుండా రైలు మార్గాలు నిర్మిస్తారు.హైదరాబాద్ – విజయవాడ,విజయవాడ – చెన్నై, గుంటూరు – నంద్యాల,కర్నూలు – కడప, విజయనగరం – పార్వతీపురం పట్టణాల మధ్య కనెక్టివిటీ, సరుకు రవాణా, ప్రాంతీయ వృద్ధికి దోహదపడేలా ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఈ రైలు మార్గ నిర్మాణం వల్ల అటు రవాణా రంగానికి ఇటు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Authored by: Vaddadi udayakumar