వాషింగ్టన్ డిసి,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) అనే నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారు. అలా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలపై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(ఎంఏజిఏ) లో భాగంగా దేశంలోని వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు పేరుతో విదేశీయులను ఉద్యోగాల నుంచి తొలగించి స్వదేశాలకు పంపించారు. అంతటితో ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాల మోత మోగించారు. ఈ క్రమంలో ట్రంప్ దుందుడుకు వ్యక్తిత్వంతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అమెరికాకు ఆయా దేశాలు పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో భారత్ తో పాటు ఇప్పటివరకూ 25 దేశాలు చేరాయి. అలా 88 పోస్టల్ ఆపరేటర్లు పూర్తిగా లేదా పాక్షికంగా సేవలు నిలిపివేసినట్లు సమాచారం అందుతోంది.ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయంతో అమెరికా పోస్టల్ ట్రాఫిక్ 80 శాతం తగ్గిపోయినట్లు స్పష్టం అవుతోంది.
Authored by: Vaddadi udayakumar