జాతీయ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ చార్జీలు మోత ఎత్తివేత

బిజినెస్ డెస్క్,ఐఏషియన్ న్యూస్: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహిస్తున్నారా? లేదంటే ఛార్జీలు పడతాయనే ఆందోళనలో ఉన్నారా? అయితే, ఈ కథనం మీరు చదవాల్సిందే. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మరో ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఖాతాలో కనీస సగటు నెలవారీ నగదు నిల్వ ఛార్జీలను మాఫీ చేశాయి.తాజాగా ఈ జాబితాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరింది. సెప్టెంబర్ త్రైమాసికం నుంచే ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని తెలిపింది.జనరల్ సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం కొద్ది రోజుల క్రితమే సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహణ ఛార్జీలను ఎత్తి వేసింది. ఈనెల ఒకటి నుంచే ఈ రూల్స్ అమలు చేస్తోంది. పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా ఇకపై ఎలాంటి ఛార్జీలు పడవు.అయితే, ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ పథకాలకు వర్తించదని తెలిపింది.

ఇండియన్ బ్యాంక్                                                                                                                                                      ఈ ప్రభుత్వ బ్యాంక్ సైతం మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను మాఫీ చేసింది. అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకుంటే విధించే ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవలే తెలిపింది. ఇప్పుడు జీరోనే హీరో అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేపట్టింది.ఈ కొత్త రూల్స్ ఈనెల2 నుంచే అమలు చేస్తోంది.

కెనరా బ్యాంక్..
ఈ ప్రభుత్వ బ్యాంక్ ఈ ఏడాది మే నెలలోనే సేవింగ్స్ అకౌంట్లలోని సగటు నెలవారీ నగదు నిల్వ ఛార్జీలను మాఫీ చేసినట్లు ప్రకటించింది.రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లు,శాలరీ అకౌంట్లు,ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకూ వర్తిస్తుందని తెలిపింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ చాలా కాలంగా మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను అమలు చేయడం లేదు.అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లపై కనీస నగదు నిల్వ ఛార్జీలను 2020 నుంచే ఎత్తివేసింది.కనీస బ్యాలెన్స్ నిల్వ లేకుంటే ఛార్జీలు విధించడం లేదు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
సేవింగ్స్ అకౌంట్లలో కనీస నగదు నిల్వ లేకుంటే విధించే ఛార్జీలను బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం మాఫీ చేసింది.ఈ మార్పులు మార్కెట్ డైనమిక్స్‌కు అనుగుణంగా, ఆర్థిక సరళతను పెంపొందించడానికి, అన్ని విభాగాలలోని కస్టమర్లకు ఎక్కువ విలువను అందించడానికి ఉద్దేశించినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇలా జాతీయ బ్యాంకులన్నీ మినిమం బాలన్స్ చార్జీలు ఎత్తివేయడం వల్ల సాధారణ ఖాతాల కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

డ్వాక్రా మహిళలకు “మన డబ్బులు- మన లెక్కలు” ఏఐ యాప్ ఏర్పాటు

రాష్ట్రవ్యాప్తంగా 83 లక్షల డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి రానున్న యాప్ ఈ యాప్ వినియోగంపై మహిళలకు శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *