విద్యుత్ శాఖలో త్వరలోనే 2,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎంకు వివరించారు.సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పాలి.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఉపాధి హామీ పథకం కొత్త చట్టంపై 26న గ్రామసభలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వికసిత భారత్-గ్యారంటీ ఫర్ రోజ్ర్, ఆజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *