తిరుపతికి మరో వందే భారత్: విశాఖ టు బెంగళూరు

విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: రైల్వే అధికారులు శ్రీవారి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ పై సానుకూలంగా స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. మరిన్ని కొత్త సర్వీసుల కోసం ఎంపీలు రైల్వే మంత్రికి నేరుగా ప్రతిపాదనలు చేస్తున్నారు. తాజాగా విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి కొత్త వందేభారత్ ఖరారు పైన తుది కసరత్తు జరుగుతోంది. డివిజన్ అధికారులు రూట్, షెడ్యూల్ పైన నివేదికలు ఇచ్చారు.
విశాఖ టు బెంగళూరు
తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ సేవలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్త సర్వీసు లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు జారుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఇప్పటికే కొత్త సర్వీసుల పైన రైల్వే శాఖకు ప్రతిపాదనలు ఇస్తున్నారు. తాజాగా విశాఖ నుంచి బెంగళూరు, విశాఖ నుంచి తిరుపతికి వచ్చిన డిమాండ్ల పైన రైల్వే శాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. రెండు రైళ్ల స్థానంలో విశాఖ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి మీదుగా వందేభారత్ ప్రకటన కు తుది కసరత్తు జరుగుతోంది.విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి వందేభారత్ పైన ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్నా విశాఖ నుంచి వస్తున్న డిమాండ్ తో ఈ రైలు ను విజయవాడ నుంచి కాకుండా విశాఖ నుంచి ప్రారంభించే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వందే భారత్ అందుబాటులోకి వస్తే, ఉత్తరాంధ్ర నుంచి తిరుమల యాత్రికులకు,అలాగే బెంగళూరు వంటి ప్రముఖ నగరాలకు ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యం కలుగుతుంది.
రూట్ – స్టేషన్లు
ఈ రైలు అందుబాటులోకి వస్తే బెంగళూరు ప్రయాణం ఇతర రైళ్ల కంటే 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసి చైర్‌కార్,ఒకటి ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ ఉండనున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా వారానికి 6 రోజుల పాటు నడవనుంది. విశాఖ లో బయల్దేరి రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరుకు వెళ్లేలా రూట్ ఖరారు చేసారు. అదే సమయంలో వందేభారత్ స్లీపర్ పైన చర్చ జరుగుతోంది.దీంతో, స్లీపర్ త్వరలో పట్టాలు ఎక్కనుండటంతో ఈ దిశగానూ అధికారులు ఆలోచన చేస్తున్నారు. దీని పైన త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *