రెండోవిడత ల్యాండ్ పూలింగ్ పై త్రిసభ్య కమిటీ సమావేశం

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

అమరావతి,ఐఏషియ న్యూస్: అమరావతికేంద్రంగాకీలకనిర్ణయాలుజరగుతున్నాయిరైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రెండో విడత లాండ్ పూలింగ్ కు నిర్ణయం తరువాత త్రిసభ కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం పైన కసరత్తు చేస్తోంది. అటు అమరావతిలో లాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. లాండ్ పూలింగ్ కు ముందుకు రాని రైతుల విషయంలో ఏం చేయాలనే అంశం పైన శనివారం త్రిసభ్య కమిటీ చర్చించింది. కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో రైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధానిలో లంక భూముల ఇష్యూ క్లియర్ అయ్యిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాయపూడి సీఆర్డీయే కార్యాలయంలో శనివారం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. గ్రీన్ బఫర్ జోన్ తుళ్ళూరులో అడిగారని దీని వల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్‌ అవుతుండగా దాన్ని 3కు తగ్గించినట్లు పెమ్మసాని చెప్పారు.2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వలేదని. వారితో మరోసారి మాట్లాడతామని తెలిపారు. 120 మంది రైతులు ల్యాండ్ ఆల్టర్నేటివ్ అయినా కూడా తీసుకుంటా మని అన్నారని చెప్పారు. రోడ్డు శూల ఉన్న భూములకు వాక్ వేలు సరి చేస్తామన్నారు. వాస్తు అనేది ఎండ్ లెస్ అని.. మొదట్లో వాస్తు ప్రకారం చేశారని ప్రతీసారి వాస్తు విషయం చూడలేమని స్పష్టం చేశారు.26 గ్రామాల్లో డీపీఆర్ చేసి ఇస్తామని చెప్పామని.. బౌండరీ స్టోన్స్‌లను సోమవారం నుంచి రెండు వైపులా వేయనున్నట్లు తెలిపారు. సోషల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కింద 18 కమ్యూనిటీ హాల్‌లు కావాలన్నారని, స్మశానాల విషయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూర్చుని చర్చిస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *