ఏసీబీ వలలో ఏపీ సీపీడీసీయల్ ఏఈ పెద్దమస్తాన్

కారంపూడి,ఐఏషియ న్యూస్: కారంపూడి షేక్ మస్తాన్ వలి కారంపూడి చిన్న వ్యాపారం నిమిత్తం షాపు నడుపుతున్నాడు.విద్యుత్ ఏఈ పెద్దకోట మస్తాన్, బాధితుడు షేక్ మస్తాన్ జానీ అనే వ్యక్తిని ఎలక్ట్రికల్ సర్వీస్ మీటర్ కనెక్షన్ ఇచ్చేటందుకు బాధితుడు వద్ద నుండి 25రూ వేల లంచం డిమాండ్ చేశారు.ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు షేక్ మస్తాన్ జానీ. ఈ నేపద్యంలో గురువారం విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మతే మాట్లాడుతూ ఏ ఈ పై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు.ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు ఇవ్వాల్సిందని బెదిరించిన యెడల 1064 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని ఆయన తెలిపారు.ఈ దాడులలో ఏసీబీ అధికారులు సిఐలు నాగరాజు, సుబ్బారావు, మన్మధరావు, సురేషబాబు ఎస్ ఐ సిబ్బంది పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

భీమవరం డిఎస్పి జయసూర్య బదిలీ

భీమవరం,ఐఏషియ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *