రాబోయే హాలిడేస్ సీజన్లో 200కు పైగా అండర్ సర్వేడ్ (వెనుకబడిన వర్గాల ప్రజలు) కుటుంబాలకు అండగా ఆటా-
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) న్యూ జెర్సీ టీమ్ మరియు ATA NJ యూత్ టీమ్ బృందం సంయుక్త ఆధ్వర్యంలో నేడు ఒక విశేషమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ ప్రాంతంలో ఉన్న Open Door Food Pantry కు 2,000 పౌండ్లకు పైగా నిల్వ ఉంచగలిగే ఆహార పదార్థాలను విరాళంగా అందించారు.
ఈ ఆహార విరాళాల ద్వారా రాబోయే హాలిడేస్ సీజన్లో ఆహార అవసరాలు ఉన్న 200కు పైగా కుటుంబాలకు సహాయం అందనుంది.
సమాజ సేవే లక్ష్యంగా, అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే సదుద్దేశంతో ATA చేపట్టిన ఈ కార్యక్రమం మానవత్వానికి, సామాజిక బాధ్యతకు మరియు సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమాన్ని నిర్వహించిన వారు – ATA NJ యువజన బృందం
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన యువత:
• ఇషితా ములే
• ఇషాని రెడ్డి కోరమ్
• షణ్ముఖప్రియ ములే
• అయాన్ రెడ్డి తుమ్మల
• సహజ వుల్లపుల
• రిషిత జంబుల
• సహర్ష కోర్కిశాల
కార్యక్రమ సమన్వయకర్తలు – ATA ప్రాంతీయ సమన్వయకర్తలు
• కృష్ణ మోహన్ ములే
• ప్రదీప్ కట్టా
• ప్రసాద్ ఆకుల
కార్యక్రమానికి సహకరించిన వారు
• సంతోష్ రెడ్డి కోరమ్ – ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT)
• వినోద్ కోడూరు – ATA బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (BOT)
• విలాస్ రెడ్డి జంబుల – ATA రీజినల్ డైరెక్టర్
• శ్రీకాంత్ తుమ్మల – ATA మెంబర్షిప్ చైర్
• శరత్ వేముల – ATA న్యూ జెర్సీ సీనియర్ నాయకులు
• ఇతర కమ్యూనిటీ సభ్యులు మరియు వాలంటీర్లు.
ఈ సేవా కార్యక్రమానికి తమ ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించిన ATA చైర్ జయంత్ చెల్లా గారికి మరియు ప్రెసిడెంట్-ఎలెక్ట్ సతీష్ రామసహాయం గారికి ATA రీజినల్ కోఆర్డినేటర్స్ మరియు న్యూ జెర్సీ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ATA NJ యూత్ టీమ్ చూపిన చొరవ, అంకితభావం, సేవా స్ఫూర్తి ప్రత్యేకంగా అభినందనీయం. యువతలో సామాజిక బాధ్యతను, నాయకత్వ లక్షణాలను మరియు సేవాభావాన్ని పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి.
సేవే మన ధర్మం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం!
ఒక్క మంచి ఆలోచన, ఒక్క చిన్న సహాయం… ఎన్నో కుటుంబాల జీవితాల్లో ఆనందాన్ని నింపగలవు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) – న్యూ జెర్సీ బృందం

News Website (iasianews.net) I Asia News