విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: ఆధార్ సేవల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆధార్ అప్డేట్ కోసం యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆధార్ అప్డేట్ కోసం కొత్త ఫీజులను ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది.ఛార్జీలను పెంచింది. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఇప్పటికే ఖరారు చేసింది.దీంతో, కొత్త ధరల మేరకు ఆధార్ అప్డేట్.. సేవలు కొనసాగుతున్నాయి.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్‌డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు ఈనెల 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి. వ్యక్తిగత వివరాల అప్‌డేట్ కోసం ఇప్పటి వరకు రూ.50 మాత్రమే ఉండేది. అయితే, ఇప్పుడు రూ 75 కి పెరిగింది. వేలిముద్రలు, కంటి స్కాన్ (ఐరిస్) లేదా ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఇప్పుడు రూ.125 చెల్లించాలి.
2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు రూ.150కి పెరుగుతుంది. గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్ల ను అప్‌డేట్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మై ఆధార్ పోర్టల్‌లో జూన్ 14, 2026 వరకు ఈ అప్‌డేట్లు ఉచితం. అంటే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాలలో మీ డాక్యుమెంట్ అప్‌డేట్‌కు రూ. 75 చెల్లించాలని వెల్లడించింది.ఆధార్ కార్డు ప్రింటౌట్ తీసుకోవడానికి లేదా ఈ-కేవైసీ ద్వారా వివరాలను పొందడానికి ఇప్పుడు రూ.40 చెల్లించాలి. రెండో దశలో (2028 అక్టోబర్ నుంచి) ఈ ఫీజు రూ.50కి పెరుగుతుంది. పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయడాన్ని ప్రోత్సహించడానికి యు ఐ డి ఐ ఏ కొన్ని ఫీజులను మాఫీ చేసింది. 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితమని వెల్లడించారు.7-15 సంవత్సరా ల వయస్సు వారికి బయోమెట్రిక్ అప్‌డేట్‌కు రూ.125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేసారు. హోమ్ ఎన్‌రోల్‌మెంట్ కోసం రూ.700 (జిఎస్టితో సహా) చెల్లించాలి. ఒకే చిరునామాలో ఒకరి కంటే ఎక్కువమందిఈసేవనుఉపయోగించినట్లయితే, అదనపు వ్యక్తికి రూ.350 చెల్లించాలి.
Authored by: Vaddadi udayakumar