హైదరాబాద్,ఐఏషియ న్యూస్:నార్సింగి పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్. మణి హారిక మంగళవారం లంచం తీసుకుంటు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.ఫిర్యాదుదారునికి చెందిన ఓ ప్లాటు క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్) జారీ చేసేందుకు, దానిని ప్రాసెస్ చేయడానికి మణి హారిక మొదట 10 లక్షల లంచం డిమాండ్ చేయగా అందులో భాగంగా 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న నగదు నాలుగు లక్షల ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి హారిక పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఎ సి డి ఎస్ పి శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.
Authored by: Vaddadi udayakumar