విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: ఒక్కరోజు పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకుస్థానిక నేతలు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.మంగళవారం హెలికాప్టర్ ద్వారా బీచ్ రోడ్డులో గల కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిపాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీభరత్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీవేపాడ చిరంజీవిరావు, శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, ఎంఎం కొండయ్య, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, పితాని సత్యనారాయణ, విఎంఆర్డిఏ చైర్మన్ ప్ర ణవ్ గోపాల్, చైర్మన్ మారీ టైం బోర్డు డి సత్య ఘన స్వాగతం పలికారు.
ఆత్మీయ వీడ్కోలు
విశాఖలో ఒకరోజు పర్యటన ముగించుకుని తిరిగి ఉండవల్లి వెళ్ళిపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధులు అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విఎన్ఆర్డిఏ కమిషనర్ కె. విశ్వనాథన్, జీసీసీ ఎండి కల్పనా కుమారి, డీసీపీ మేరీ ప్రశాంతి, విశాఖ ఆర్డీవో పి. శ్రీలేఖ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
Authored by: Vaddadi udayakumar