రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి
అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సి బకాయిల పైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షర్ల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని,12వ పిఆర్సీ కమీషన్ తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. మూడు నెలల్లోగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు కోరాయి.ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు డిమాండ్ చేసారు. ఉద్యోగులు, పెన్షర్లకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు, పెన్షర్లలో తీవ్ర ఆవేదన నెలకుందని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల పెన్షర్ల ఆవేదనను అర్దం చేసుకోవాలని కోరారు. ఆర్దిక పరమైన సమస్యలు పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఉద్యోగుల నుండి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్దితి వస్తుందని బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.ఈ నెల 20న సీఎస్ వద్ద జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక, ఆర్థికేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.సీఎస్ తో సమావేశం జరిగినా ఈనెల 21 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబందిన అంశాలు కనీసం చర్చకు రాక పోవడం ఉద్యోగులను, పెన్షర్లను తీవ్రమైన నిరాశకు గురిచేసిందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. రిటైర్ అయిన ప్రతి పెన్షనర్ కు ప్రభుత్వం నుంచి 15 నుండి 25 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, ఇప్పటికే రావల్సిన మూడు డిఏ లు ప్రకటించక పోవడతోను ఉద్యోగి ఆవసరాలకోసం పెట్టుకున్న పెట్టుకున్న సరండర్ లీవులు డబ్బులు కూడా చెల్లించక పోవడం తో ప్రతి ఉద్యోగి, పెన్షర్ కూడా ఆర్దికంగా నష్టపోతున్నారని వివరించారు. ఉద్యోగ సమస్యల పై కేబినెట్ సబ్ కమిటీ చర్చించాలని సూచించారు. గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకుసీనియారిటీప్రకారంపదోన్నతులు,నోషనల్ ఇంక్రీమెంట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్ – 6కు మాత్రమే ప్రత్యక్ష నియామకం జరుపాలని తెలిపారు.
Authored by: Vaddadi udayakumar