విశాఖపట్నం,ఐఏషియ జ్యోతిబ్యూరో: వియత్నాం దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో విశాఖ గోపాలపట్నానికి చెందిన బొడ్డేటి డింపుల్ హిరణ్య సూపర్ గ్లోబల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచి విశాఖ ఖ్యాతి పెంచింది.గురువారం విశాఖ చేరుకున్న సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో హిరణ్య బంధువులు, స్నేహితులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విశాఖ టింపనీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న హిరణ్యకు తల్లి ప్రవళిక అండదండలు అందిస్తూ తనదైన శైలిలో ఆమెను ప్రోత్సహిస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. హిరణ్య తాతయ్య పిల్ల రాజబాబు అమ్మమ్మ లావణ్య మనవరాలు గారాల పట్టి హిరణ్యకు చేదోడుగా నిలిచి ఈ స్థాయికి రావటానికి పరోక్షంగా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా హిరణ్య మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయిని అధిరోహించాలని అకుంఠిత దీక్షతో తల్లి ప్రవళిక శిక్షణలో 15 సంవత్సరాల అందాల పోటీలలో ఐదవ స్థానం నిలిచినందుకు గర్వకారణంగా ఉందని తెలిపారు. రాబోయే అందాల పోటీల్లో మరింతగా రాణిస్తానని భారతదేశానికి వన్నెతెచ్చే విధంగా ప్రయత్నిస్తానన్నారు. తన మేన మామ వంశీ కిషోర్ తన వెన్నంటే ఉండి ఈ స్థాయికి చేరేలా దోహదపడ్డారన్నారు.తనకు విద్యాభ్యాసాలు నేర్పుతూ చక్కటి క్రమశిక్షణతో పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన తాత రాజబాబు,అమ్మమ్మ లావణ్య రుణపడి ఉంటానని తెలిపారు. చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన డింపుల్ హిరణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని బంధుమిత్రులు స్థానికులు ఆకాంక్షించారు.
Authored by: Vaddadi udayakumar