- 38 లక్షల నగదు,10 కేజీల బంగారం చోరీ
తూముకుంట(శ్రీ సత్య సాయి జిల్లా),ఐఏషియ న్యూస్: శ్రీసత్యసాయి జిల్లాలోని తూముకుంట పారిశ్రామికవాడలో ఎస్బీఐ బ్యాంకులో ఆదివారం రాత్రి దుండగులు భారీ దోపిడీ చేశారు.కిటికీ కోసి లోనికి వెళ్లి సీసీ కెమెరా వైర్లు కట్ చేసి, లాకర్ తాళాలు విరిచి రూ.38 లక్షలు, 10 కేజీల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది బ్యాంకు తెరిచి బ్యాంకులో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీ సంఘటనపై పోలీసు అధికారులకు ఫిర్యాదు సంఘటనా స్థలాన్ని డిసిపిమహేశ్, ఎస్ ఐ అబ్దుల్ కరీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. ఎస్బిఐలో భారీ చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేపింది. బ్యాంకు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం చోరీ కావడంతో ఖాతాదారులు బ్యాంకుకు చేరుకున్నారు.
Authored by: Vaddadi udayakumar