Spiritual

ఆధ్యాత్మిక ఉత్సాహం తీసుకువచ్చిన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: వినాయక చవితి పర్వదినం అంటే తెలుగు ప్రజలందరికీ ఆధ్యాత్మిక ఉత్సాహం, భక్తి పరవశం. అలాంటి పవిత్ర సందర్భంలో హైదరాబాద్ నగర పరిధిలో గల ఖైరతాబాద్ మహాగణపతి ఆరాధనీయ స్వరూపంలో కొలువుదీరి, భక్తుల మనసుల్లో భక్తి స్ఫూర్తిని నింపుతున్నాడు.63 అడుగుల ఎత్తులో మహిమామూర్తిగా నిలిచిన మహాగణపతి, ఎర్రటి కనులతో భక్తుల్ని కరుణా దృష్టితో చూస్తూ, గోకులంలో గోపాలుడిలా, మందిరంలో దేవుడిలా భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాడు. తెల్లవారుజామున మొదలైన మంత్రోచ్ఛారణలు, ఘంటానాదాలు, “గణనాథ శరణం” నినాదాలు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించాయి. Authored by: Vaddadi …

Read More »

ఇంట్లోనే “వినాయక పూజ” చేసిన మాజీ సీఎం జగన్

తాడేపల్లి,ఐఏషియ న్యూస్: విజయవాడలోని రాణిగారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్దకు వెళ్లి పూజ నిర్వహించాలని మొదట మాజీ సీఎం వైఎస్ జగన్ భావించారు. అయితే బుధవారం నగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జగన్ నగరంలోకి వెళ్లి గణేష్ పూజలో పాల్గొనే పరిస్ధితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పరిస్ధితిని గ్రహించిన జగన్ తాడేపల్లిలో తన ఇంట్లోనే గణేష్ పూజకు ఏర్పాట్లు చేయించారు. అక్కడే ఆయన గణేష్ పూజ చేశారు. దీంతో జగన్ పంతం నెగ్గినట్లయింది.తిరుమల డిక్లరేషన్ పేరుతో …

Read More »

గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించా అందరిలో ఐక్యత భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి రూ.30కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం విజయవాడలో డూండీ గణేశ్ సేవా సమితి మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం చంద్రబాబు విజయవాడ,ఐఏషియ బ్యూరో: విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించానని చెప్పారు.విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు …

Read More »

గణనాథునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు

టెక్సాస్,ఐఏషియా ప్రత్యేక ప్రతినిధి: వినాయకచవితి సందర్భంగా ఇర్వింగ్ టెక్సాస్ లో గల డి ఎఫ్ డబ్ల్యు గణపతి ఆలయంలో నెలకొన్న గణనాధునికి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయానికి భక్తులు చేరుకుని విఘ్నేశ్వరుని దర్శించుకుని నామాలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు వినాయక స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణేష్ హోమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వినాయక చవితి …

Read More »

ఏపీలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం

అమరావతి,ఐఏషియ న్యూస్: వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా యువత, ఉత్సవ కమిటీలు వాడవాడలా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.వినాయకచవితికిమాత్రమేకాదు.విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఫ్రీ కరెంట్ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చి్ంచిన తర్వాత ఈ నిర్ణయం …

Read More »

అంగరంగ వైభముగా సింహాద్రినాధుని నిత్య కల్యాణం

సింహాచలం,ఐఏషియ న్యూస్:  ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతోకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు …

Read More »

శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మహా పూర్ణాహుతితో ముగిసిన శ్రావణలక్ష్మి పూజలు

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో నెలరోజులు పాటు ఘనంగా నిర్వహించిన శ్రావణ లక్ష్మి పూజలు శనివారం నిర్వహించిన మహా పూర్ణహుతితో ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి కే. శోభరాణి, వేద పండితులు,అర్చకులు,ఉభయదాతలు, సిబ్బంది పాల్గొన్నారు.  Authored by: Vaddadi udayakumar

Read More »

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష మందికి వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ

హైదరాబాద్,ఐఏషియ న్యూస్బ్యూరో: హైదరాబాద్ నగరం ఎప్పుడూ పండుగల రంగుల హరివిల్లులా ఉంటుంది. ఏ పండుగ వచ్చినా అది పెద్దగా హడావుడి చేస్తుంటారు. ముఖ్యంగా వినాయక చవితి వస్తే ప్రతి వీధి, ప్రతి ఇల్లు కొత్త ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఈసారి కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. కానీ ఈసారి పండుగ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. నగర ప్రజలకు హెచ్‌ఎండీఏ ఓ శుభవార్త చెప్పింది.గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పిఓ పి) విగ్రహాలు జలవనరులను తీవ్రంగా కలుషితం చేశాయి. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, ఇతర …

Read More »

శ్రీశైల మల్లన్నకు హుండీల ద్వారా 4 కోట్ల 51 లక్షల 62వేలు ఆదాయము లభ్యం

శ్రీశైలం,ఐఏషియ న్యూస్:  శ్రీశైల దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి గత 27 రోజులు సంబంధించి రూ.4,51,62,522 నగదు లభించిందని ఈఓ ఎం శ్రీనివాసరావు  తెలిపారు. అంతేకాకుండా హుండీలో 164 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారు, 5 కేజీల 840 గ్రాముల వెండిలభించాయని వివరించారు.598 – యుఎస్ఏ డాలర్లు, 100 – న్యూజిలాండ్ డాలర్లు, 100– సింగపూర్ డాలర్లు, 10 – ఇంగ్లాండు ఫౌండ్స్, 100 – ఈరోస్, 300 – ఓమన్ బైసా, 20 – కెనడా డాలర్లు, …

Read More »

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 150 కోట్లు మంజూరు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది, 2026 జనవరిలో ఘనంగా జరగనుంది. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. ఈ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ జాతర నిర్వహణతో పాటు శాశ్వత నిర్మాణాల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఏకంగా రూ. 150 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More »