Spiritual

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు రాయితీపై మైక్ సెట్లు, గొడుగులు, విగ్రహాలను అందించాలని నిర్ణయించింది. హిందూ ఆలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు, మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రాలను టీటీడీ అందిస్తోంది.ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తులను నింపి, డీడీ తీసి తమకు పంపాలని టీటీడీ కోరుతోంది. మరోవైపు ఆలయాల్లో ఉపయోగించే మైక్ సెట్లను టీటీడీ రాయితీ మీద అందిస్తోంది. రూ.25 వేలు విలువ చేసే మైక్ …

Read More »

ధ్వజ స్తంభాలు,రథాలు తయారీకి 100 ఎకరాల్లో వృక్షాలు పెంచాలని టిటిడి నిర్ణయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమ‌ల తిరుపతి దేవస్థానం పాలక మండలి మంగళవారం సమావేశమైంది. తిరుమల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఏర్పాటైన ఈ సమావేశానికి ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలోపలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగాటీటీడీ ఆధీనంలోని అన్ని ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేయడానికి ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచాలని నిర్ణయించారు. ధ్వజస్తంభాలు, రథాలను తయారు …

Read More »

గోదావరి నదిఒడ్డున తవ్వకాలు “సింహంపై కూర్చున్న దుర్గాదేవి” విగ్రహం ప్రత్యక్షం

మంచిర్యాల,ఐఏషియ న్యూస్: మంచిర్యాల జిల్లా, ముల్కల ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సింహంపై కూర్చున్న దుర్గాదేవి విగ్రహం లభ్యం కావడంతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయింది. ఈ అద్భుతాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. గోదావరి నది ఒడ్డున జనసందోహం నెలకొంది. అయోధ్య పూజారి సూచనతో తవ్వకాలు.. అమ్మవారి విగ్రహం బయటపడడం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇటీవల..ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యరామ మందిరం పూజారీతో పాటు పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు …

Read More »

యూపీఐ పేమెంట్లకు వీలుగా కియోస్క్ మిష‌న్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా దర్శించుకుంటారు. అలాగే దేశ‌వ్యాప్తం ఉన్న 60 టీటీడీ ఆలయాలకు కూడా భక్తులు వెళుతుంటారు. వీరి కోసం సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిష‌న్లు, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాల‌ని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారుల‌ను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని ఈవో కార్యాల‌యంలో సీనియ‌ర్ అధికారుల‌తో సోమవారం స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల్లో టీటీడీ నిర్మించ‌ద‌ల‌చిన ఐదువేల …

Read More »

తిరుపతి,తిరుమల స్థానికులకు ఈ-డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు

25 నుండి 27 వరకు ఈ-డిప్ నమోదుకు అవకాశం 29వ తేదిన టోకెన్లు కేటాయింపు తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో జనవరి 6,7,8వ తేదిల్లో రోజుకు 5వేల టోకెన్ల చొప్పున తిరుమల,తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి స్థానికుల కోటా కింద కేటాయించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేది ఉదయం 10 నుండి 27 వ తేది సాయంత్రం 5 …

Read More »

శ్రీకనకమహాలక్ష్మి దేవస్థానానికి హుండీల ద్వారా 67 లక్షల ఆదాయం

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 40 రోజులకుసంబంధించి హుండీలలో వచ్చిన నగదు,బంగారం, వెండి మొదలగు కానుకలు సోమవారం లెక్కించారు. హుండీల ద్వారా ద్వారా 67,78,784 రూపాయల ఆదాయం లభించిందని ఈవో శోభారాణి తెలియజేశారు.నగదుతోపాటు బంగారం వెండి కూడా భక్తులు సమర్పించారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఉపకమీషనరు, కార్యనిర్వాహణాధికారిణి శ్రీమతి కె. శోభారాణి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీమతి టి. అన్నపూర్ణ, 2/3 3 ఇన్స్పెక్టర్, దేవదాయశాఖ, విశాఖపట్నం, ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికార్లు ఎన్. ఆనంద్ కుమార్, …

Read More »

ఆన్లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుకు పరిశీలన

సింహాచలం,ఐఏషియ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సూచనల మేరకు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానమునందు భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో పలు గదులు, దర్శనములు, అభిషేక పూజలు, ఇతర సేవలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్ లైన్ ద్వారా వివిధ సేవలు,దర్శనములు, టికెట్లు,ప్రసాదములు బుక్ చేసుకునే భక్తులను ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనం చేసుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్ల కొరకు సోమవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి …

Read More »

గోవాలో 77 అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

గోవా,ఐఏషియ న్యూస్: గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని శుక్రవారం పీఎం మోదీ ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ శిల్పి రామ్ సుతార్ ఈ రాముడి విగ్రహాన్ని తయారు చేశారు.550 ఏళ్ల మఠం సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈనెల 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఇక్కడ వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. Authored by: Vaddadi udayakumar

Read More »

కనకమహాలక్ష్మిని దర్శించుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి

విశాఖ దక్షిణం,ఐఏషియ న్యూస్: ఉత్తరాంధ్ర కల్పవల్లి విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి శుక్రవారం కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈవో శోభారాణి ప్రిన్సిపల్ కార్యదర్శి సూర్యకుమారికి శేష వస్త్రాలు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. Authored by: Vaddadi udayakumar

Read More »

శబరిమలలో మళ్లీ పెరిగిన అయ్యప్ప భక్తుల రద్దీ

శబరిమల,ఐఏషియ న్యూస్: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది.వారం క్రితం మాదిరిగా శబరిమల సన్నిధానంలో ఇసుకేస్తే రాలనంతగా అయ్యప్ప భక్తులు కనిపిస్తున్నారు. దీంతో అయ్యప్పస్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్లో భాగంగా ఈనెల 16న శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా తొలి నాలుగు రోజుల్లో రికార్డుస్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు.ఈ వారంరోజుల్లో ఆరున్నర లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు.ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. Authored by: Vaddadi …

Read More »