Spiritual

21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

తిరుమల,ఐఏషియ న్యూస్: కలియుగ దైవం, వడ్డీకాసుల వాడు,ఏడుకొండల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమలకు రానున్నారు. ఈ నెల 21న రాష్ట్రపతి స్వామివారి సేవలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ద్రౌపదీ ముర్ము తిరుపతికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల‌ 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు.ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఈనెల 21న ఆలయ సంప్రదాయం ప్రకారం.. మొదట శ్రీ వరాహస్వామి వారిని, …

Read More »

అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

తిరుమల,ఐఏషియ న్యూస్: అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది.ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఎఫ్ ఐ పి ఓ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి.ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. Authored by: Vaddadi udayakumar

Read More »

తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు వెల్లడి తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణం గా మార్పులకు సిద్దమైంది. సాంకేతికతను వినియోగించుకొని సేవలు పెంచాలని డిసైడ్ అయింది. అదే విధంగా డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, శ్రీవారి దర్శనం,వసతి కేటాయింపుపైన టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు.టీటీడీ పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ …

Read More »

Upcoming Vedanta Retreats in USA 2025

A series of programs blessed by the Jagadgurus of Sringeri Sri Sharada Peetham, introducing seekers to the timeless wisdom of the Upanishads and Advaita. Presented in a structured and accessible way,these sessions  bring out the essence of vedanta- inspiring reflection, deepening understanding, and connecting participants with its living tradition.

Read More »

శబరిమల అయ్యప్పను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

శబరిమల,ఐఏషియ న్యూస్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి ఆలయాన్ని బుధవారం దర్శించుకున్నారు. మెుదట పంబా నదిలో కాళ్లను కడుక్కోవడం ద్వారా సాంప్రదాయ శుద్ధి ఆచారాన్ని పాటించారు. అనంతరం ఆమె పంపా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడే ఇరుముడిని సిద్ధం చేసుకుని అయ్యప్ప సన్నిధానంకు చేరుకున్నారు. అక్కడ ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి 18 బంగారు మెట్లు ఎక్కి అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక అభిషేక …

Read More »

సింహాచలం “ఈవో త్రినాధరావు” ఆకస్మిక బదిలీ

డిప్యూటీ కమిషనర్ సుజాతకు ఈవోగా అదనపు బాధ్యతలు సింహాచలం,ఐఏషియ న్యూస్: సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిపాలనలో మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రస్తుత ఈవో వి త్రినాధరావు బదిలీ ఆకస్మికంగా కావడంతో, డిప్యూటీ కమిషనర్ సుజాతకు సింహాచలం దేవస్థానం ఈవో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్ లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇంత హడావుడిగా సింహాచలం ఈవో త్రినాధ రావు బదిలీపై సర్వత్ర చర్చంసనీయంగా మారింది. ఈ బదిలీ వెనక ఆంతర్యం ఏమిటా? అని దేవస్థానం ఉద్యోగులు,రాజకీయ ప్రముఖులు …

Read More »

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

శబరిమల,ఐఏషియ న్యూస్:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్ బృందం, క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ నేతృత్వంలో గురువారం ఉదయం నుండి కిలిమనూరు సమీపంలోని ఉన్నికృష్ణన్ నివాసంలో దాదాపు 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. అనంతరం,శుక్రవారం తెల్లవారుజామున అతని అరెస్టును …

Read More »

కనకదుర్గ ఆలయ పాలకమండలి ధర్మకర్తగా పద్మావతి ప్రమాణస్వీకారం

విజయవాడ,ఐఏషియ న్యూస్: కనకదుర్గ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలిగా శ్రీమతి పద్మావతి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.ఆలయ ఈవో వి. కె. శీనా నాయక్ మహా మంటపంలో గల కార్యాలయంలో పద్మావతి చేత ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,మాజీ శాసన సభ్యులు ఎస్. ఉదయభాను,ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవ రాజు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. Authored by: Vaddadi udayakumar

Read More »

తిరుపతి వెంకన్న “లడ్డు ధర పెంచే” ప్రణాళిక లేదు

ఎక్స్ వేదికగా స్పందించిన టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు తిరుమల,ఐఏషియ న్యూస్: ఏడు కొండలపై కొలువైన తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం ధర పెరగబోతున్నట్లు తాజాగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఈ వార్తల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసారం ధర పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు లడ్డూ ప్రసాదం రేట్లు పెంచడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.తిరుపతి …

Read More »

కనకదుర్గ అమ్మవారికి ఆభరణాల సమర్పణ

విజయవాడ,ఐఏషియ న్యూస్: విజయవాడ కీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి కి గురువారం రాత్రి 8. 30గంటలకు దేవస్థానంనకు దాతలు విచ్చేసి 531 గ్రాముల విశేష వజ్రాభరణాలు సమర్పించారు.సూర్యుడు, చంద్రుడు, ముక్కు పుడక, బులాకీ,బొట్టు, సూత్రాలు, గొలుసు ఈ ఆభరణాలు బంగారంతో చేయించి, వజ్రాలు పొదిగి తయారు చేశారు. దాతల నుండి ఆభరణాలును ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ,ఈవో శీనానాయక్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి శ్రీమతి లక్ష్మిరవి, శ్రీ గోకరాజు గంగరాజు, శ్రీ కనుమూరి బాపిరాజు,శ్రీ సూరజ్ శాంతకుమార్ డైరక్టర్, కీర్తిలాల్ కాళిదాస్ …

Read More »