శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

హైదరాబాద్‌,ఐఏషియ న్యూస్: శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న ఆమెకు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. 18న నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్‌ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరుతారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పుట్టినరోజు ఆశీస్సులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఉదయం సోషల్ మీడియాలో ఆశీస్సులు.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *