అమరావతి,ఐఏషియ న్యూస్: సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మించే ప్రతి భవనం విలక్షణంగా ఉండాలని ఆయన సూచించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. రూ.165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడెమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తెలుగు ఆత్మగౌరవానికి, వైభవానికి ప్రతీకగా నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వేర్వేరు ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ కె.విజయానంద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar
News Website (iasianews.net) I Asia News