డిసెంబర్ లో పంచాయతీ ఎన్నికలు

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: సర్పంచ్ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ను విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది. ఓటింగ్జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కూడా “అన్న క్యాంటీన్లు” ఏర్పాటు

గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీ ప్రజలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *