విశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన పోలీసులకు హోంమంత్రి అభినందనలు

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖపట్నం నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. జాతీయ వార్షిక నివేదిక- 2025లో విశాఖ చోటు దక్కించుకున్న సందర్భంగా ఆర్కే బీచ్ ఐ ఎన్ ఎస్ కురుసురా నుంచి ఏయూ కన్వెన్షన్ వరకు జరిగిన ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏయూ కన్వెన్షన్ హాల్ లో జరిగిన వేడుకలో పాల్గొనడం జరిగింది. విశాఖపట్నానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన పోలీసులకు9 అభినందనలు. శక్తి టీమ్స్, శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోంది. కార్యక్రమంలో భాగంగా నేరస్థులకు తక్కువ సమయంలో శిక్ష పడేలా చేసిన అధికారులను సన్మానించడం జరిగింది. ఇన్విజిబుల్ పోలీస్ – విజిబుల్ పోలీసింగ్, మహిళల రక్షణ కోసం శక్తి యాప్, పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం వంటి అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తున్న నగరంగా దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నం మాత్రమే నిలవడం విశేషం. భవిష్యత్తులోనూ మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది. కార్యక్రమంలో ఏయూ వీసి రాజశేఖర్,సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్

హైదరాబాద్,ఐఏషియ న్యూస్: హైదరాబాద్ లో మాదకద్రవ్యాల వ్యాపారం మరోసారి కలకలం రేపింది. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , చిక్కడపల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *