తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం

టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడు వెల్లడి

తిరుమల,ఐఏషియ న్యూస్: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణం గా మార్పులకు సిద్దమైంది. సాంకేతికతను వినియోగించుకొని సేవలు పెంచాలని డిసైడ్ అయింది. అదే విధంగా డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనం పది రోజులు కొనసాగించాలని నిర్ణయించింది. కాగా, శ్రీవారి దర్శనం,వసతి కేటాయింపుపైన టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక అంశాలను వెల్లడించారు.టీటీడీ పాలక మండలి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సమయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తాము ఏడాది కాలంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికోసం ఏఐ సాయంతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About I Asia News

Check Also

హిందూ దేవాలయాలకు రాయితీపై దేవత విగ్రహాలు,మైక్ సెట్,గొడుగులు,శేష వస్త్రాలు విక్రయం

తిరుమల,ఐఏషియ న్యూస్: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *