17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శలేని మచ్చలుంటే తెలపండి: కలెక్టర్ హరేందిర ప్రసాద్

విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (ఎల్సిడిసి) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం ఎన్ హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి లోని ఆశా కార్యకర్తలు, మగ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలన్నారు. ఎవరైనా తమ శరీరం పై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ప్రాధమికస్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా ,ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందన్నారు.వసతిగృహాల్లో ఉండే పిల్లలను కూడా పరిశీలించాలన్నారు.ప్రతిరోజూ 30 నుండి 40 గృహాలను సందర్శించి వ్యాధి గ్రస్తులు ఉన్నట్లయితే గుర్తించి మందులు ఇవ్వాలన్నారు. మందులు ఉచితంగా ఇవ్వబడతాయన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినపుడు వారికి సహకరించి తనిఖీ చేయించు కోవాలన్నారు.కుష్టు వ్యాధినిర్మూలనకుమండల ,గ్రామ స్థాయి లో అధికారులు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.ఆర్.రమేష్, జిల్లాపరిషత్ సి. ఇ. ఓ. నారాయణమూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు, డి ఎన్ ఎం ఓ డా. పద్మావతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

మహిళా ఉద్యోగులకు,ఒంటరి పురుషులకు సీఎం చంద్రబాబు శుభవార్త

అమరావతి,ఐఏషియ న్యూస్: ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఇవాళ ఓ శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన ఓ హామీని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *