విశాఖ బీచ్ లో హాప్ ఆన్ హాప్ అఫ్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం,,ఐఏషియ న్యూస్: విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్డులో హాప్ ఆన్ – హాప్ అఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజా ప్రతినిధులతో కలిసిసీఎంకొంతదూరంప్రయాణించారు. బస్సు నుంచే బీచ్ లో ఉన్న పర్యాటకులకు అభివాదం చేశారు. పర్యాటకులకు కొత్త అనుభవం కలిగేలా ఈ బస్సులో ప్రయాణం ఉంటుందని సీఎం అన్నారు. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటల పాటు ఒకే టికెట్‌తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ రూ.500గా నిర్ణయించగా, అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. కేవలం రూ.250 లకే 24 గంటల పాటు హాప్ ఆన్ – హాప్ ఆఫ్ బస్సులో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పౌరులు, పర్యాటకులు పర్యావరణ హితంగా ప్రవర్తించాలని, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్‌లను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు. మరోవైపు గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పినా, వారి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిలోనే కొట్టుకుపోయారని విమర్శించారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్‌గా ఎదగబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ భారత్‌కే టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతుందన్నారు.మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ
మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు,చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.డోలా శ్రీ‌ బాల వీరాంజనేయ స్వామి,హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాస‌రావు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లాకలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

తిరుపతికి మరో వందే భారత్: విశాఖ టు బెంగళూరు

విశాఖపట్నం,ఐఏషియ బ్యూరో: రైల్వే అధికారులు శ్రీవారి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *