జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
శ్రీకాకుళం,ఐఏషియ న్యూస్: ఇటీవల వర్షాల కారణంగా పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 5,250 ఎకరాలు పంటలు నీటమునిగి నష్టపోయినందున రైతులకు నష్ట పరిహారం అందించాలని, టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రెండు సంవత్సరాలకు గాను రూ.40 వేలు చెల్లించాలని,నియోజకవర్గంలో పలు సమస్యలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి, నాయకులు,రైతులతో కలసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు.
Authored by: Vaddadi udayakumar