వ్యవసాయ శాఖ,మార్క్ ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ,ఐఏషియ న్యూస్: ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా, ప్రణాళిక బద్ధంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నా కూడాకొన్నిప్రాంతాల్లోఇబ్బందులుతలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్క్ ఫెడ్ ఎండీ మనజీర్ జిలాని సామున్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది ఖరీప్ సీజన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం 16.73 లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని.
వాటిలో (యూరియా 6.22 లక్షల మెట్రిక్ న్నులు, డి.ఏ.పి- 2.60 లక్షల మెట్రిక్ టన్నులు, ఎం. ఓ పి- 0.70 లక్షల మెట్రిక్ టన్నులు, యస్ యస్ పి – 0.94 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ లు – 6.30 లక్షల మెట్రిక్ టన్నులు) అవసరం ఉందని కమిషనర్ ఢిల్లీరావు మంత్రికి వివరించారు. కేంద్రం నుండి ఆగస్ట్ నెలకు సంబంధించి రావల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.రాష్ట్రానికిఇప్పటివరకు 10.39 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని, ప్రారంభ నిల్వలు 7.13 లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 17.53 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలోని రైతులకు అందుబాటులో ఉంచామని, 10.96 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకు అందచేశామని, 6.56 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రికిఅథికారులుతెలిపారు.మంత్రిఅచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందచేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వెంటనే గుర్తించి ఆయా ప్రాంతాలకు మార్క్ ఫెడ్ గోదాములలో నిల్వలు ఉన్నటువంటి ఎరువులను త్వరితగతిన జిల్లాలలోని సహకార సంస్థలకు పంపాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ థరలకు యూరియాను, డీఏపీని అమ్ముకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఢీల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి నడ్డాను వేగంగా ఎరువులను అందచేయాలని కోరారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులు ఆర్ ఎఫ్ సీ రామగుండం నుండి 19,000 మెట్రిక్ టన్నులు , కాకినాడ పోర్ట్ కు రావాల్సిన ఎరువులు కనీసం 30,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్ట్ కు రావాల్సిన 18,500 మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వేగవంతంగా జిల్లాలకు యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని, 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. కావాలని యూరియా కొరత సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించమని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ జేడీ కృపదాస్, మార్క్ ఫెడ్ జీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Authored by: Vaddadi udayakumar