నరసరావుపేట,ఐఏషియ న్యూస్: ఫోరమ్ ఫర్ ఆర్టీఐ లో పని చేయని వారిని పదవుల నుంచి తొలగిస్తామని క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మట్ట ప్రసాద్ స్పష్టం చేశారు.జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ సూచనల మేరకు ఎఫ్ఆర్టీఐ పటిష్టతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వచ్ఛందంగా పని చేస్తామని పదవులు తీసుకొని పని చేయని వారు పదవులలో నుండి వైదొలగి కార్యకర్తగా కొనసాగవచ్చన్నారు.సీనియర్ నేత నెల్లూరుకు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొల్లా శ్రీవాసరావు, బాపట్లకు చెందిన శామ్యూల్ జాన్సన్ నాయకత్వం నుంచి తప్పుకొని సాదారణ కార్యకర్తగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్ర, జిల్లా కమిటీలలో పదవులు పొంది మీటింగ్ కి హాజరు కానివారు, కొత్తసభ్యత్వం చేయని వారు వైదొలగి కొత్తవారికి, సమర్దులకు అవకాశం ఇవ్వాలన్నారు. మూడు మీటింగ్ లకు హాజరు కానీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు తమ పదవులు రద్దు అవుతాయని, పనిచేయాలి అనే ఇంట్రస్ట్ ఉంటే జాతీయ కమిటీకి లెటర్ పెట్టి లేదా స్వయంగా కలసి పనిచేస్తామని చెప్పి మరల ప్రకటన విడుదల చేసిన తర్వాత మాత్రమే పదవిలోకి వస్తారని ప్రకటించారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పారు.ఎఫ్ ఆర్టీఐ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రకారం కుల, మత లింగ పార్టీ రహితంగా ఉంటానని నీతి నిజాయితీ గా న్యాయ బద్దంగా పని చేస్తానని ప్రమాణం చేయాలి అన్నారు. ఆర్టీఐ ఏర్పడి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్టోబర్ 5నుండి12 వరకు ఆర్టీఐ వారోత్సవాలు జరపాలని, ప్రదర్శనలు, మీటింగ్, లుజరపాలనికార్యకర్తలనుకోరారు.అదేవిధంగా కొత్త వారిని చేర్పించి కొత్త కమిటీలను తయారు చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.విజయవాడ, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పదవులలో ఉన్నవారు తన పేరు,ఫోన్ నెంబర్ ,జిల్లా గురించి తెలియజేస్తూ పదవికి న్యాయం చేస్తూ ఎఫ్ ఆర్టీఐ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణ పత్రాలు జిల్లా అధ్యక్షులు ద్వారా అమరావతి కార్యాలయానికి పంపాలన్నారు.నాయకులు,కార్యకర్తలు, అభిమానులు మీటింగ్ సమయానికే రావాలని, అసమర్ధులను,సామాజిక స్పృహ లేని వారిని మీటింగ్ లకు తీసుకు రావద్దని కోరారు. చట్టాలను గురించి నేర్చుకొని రక్షణ పొందుతూ ఇతరులకు తెలియ జేసే సహాయం మాత్రమే ఎఫ్ ఆర్టీఐ ద్వారా జరుగుతుందని,ఆర్ధిక లాభాలు ఏమి ఉండవని ఇది స్వచ్ఛంద సంస్థ అని మట్టా ప్రసాద్ స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar