విశాఖపట్నం,ఐఏషియ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పలు పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని వియ్యం ఆర్డీఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. అందులో భాగంగా కైలాసగిరి మీద ఇటీవల సుమారు 5.50 కోట్ల రూపాయల ఖర్చుతో త్రిశూలం ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా సుమారు 7 కోట్ల రూపాయల నిధుల బడ్జెట్ తో విశాఖకే కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ కే ఆకర్షణగా నిలిచే దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 25 లోపు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ కె ఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ గ్లాస్ బ్రిడ్జి విశాఖకే తలమానికంగా నిలుస్తుందని, ఇప్పటికే ప్రారంభించిన పారా సైక్లింగ్ మరియు గ్లైడింగ్ ప్రాజెక్టులు అత్యంత ఆదరణ పొందుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
Authored by: Vaddadi udayakumar