హైదరాబాద్,ఐఏషియ న్యూస్: తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పోల్చదగ్గ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి పునాది వేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని కాలగర్భంలో కలిసిపోనీయకుండా, గ్లోబల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. విద్యార్థుల కోసం కొత్త హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడింగ్ రూమ్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టళ్లను ప్రారంభించారు.ఈ ఏడాది విద్యా రంగానికి ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఉస్మానియా అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు కేటాయించేందుకుసిద్ధమనివెల్లడించారు.అంతేకాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 500 కోట్లు,స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్ వంటి ప్రాజెక్టులకు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ సమాజానికి ఉస్మానియాకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, ఈ వర్సిటీని పూర్వ వైభవానికి తీసుకెళ్లడమే తన కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Authored by: Vaddadi udayakumar