న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్: భారత్ పై అమెరికా సుంకాల పెంపుదల చేసిన క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఈ నెల మొదట్లోనే 25 శాతం సుంకాలు భారత్‌పై విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోందని పేర్కొన్న ట్రంప్ భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు బహిరంగంగానే వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం హైలెవల్ భేటీ నిర్వహించనుంది.
అమెరికా విధించే అధిక సుంకాల కారణంగా తలెత్తే సమస్యలు, సవాళ్ల గురించి ఈ భేటీలో సమాలోచనలు జరపనున్నారు. అమెరికా విధించే 50 శాతం సుంకాలతో సరికొత్త సమస్యలు తలెత్తుతాయని భారత్ భావిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ టారిఫ్‌ల కారణంగా భారత్‌లోని టెక్స్‌టైల్స్, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, స్పెషల్ కెమికల్స్ సహా పలు కీలక రంగాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పీఎంఓ అత్యున్నత స్థాయి సమావేశం జరగడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలకు అదనంగా మరో 25 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకున్నట్లయింది.. అయితే రష్యా నుంచి భారత్ కంటే ఎక్కువగా చైనా చమురు కొనుగోలు చేస్తున్నా డ్రాగన్‌పై మాత్రం ట్రంప్ జరిమానా విధించలేదు. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు భయపడేది లేదని చెప్పిన భారత్.తమకు చమురు ఎక్కడ తక్కువగా లభిస్తే,అక్కడే కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Authored by: Vaddadi udayakumar