- కేంద్ర క్యాబినెట్ నిర్ణయం
- భారీగా రేట్లు తగ్గనున్న టీవీ,వాషింగ్ మెషిన్,ఏసీలు
- హెల్త్,లైఫ్ ఇన్సూరెన్స్ లకు జీఎస్టీ ఎత్తివేత
ఏపీ చీఫ్ బ్యూరో, ఐఏషియ న్యూస్: ప్రస్తుతం వసూలు చేస్తున్న జీఎస్టీలో 12శాతం, 28శాతం స్లాబులను తొలగించి ఆ స్థానంలో కేవలం. 5శాతం, 18శాతం స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన న్యూఢిల్లీలో బుధవారం 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ విధంగా ప్రకటించారు.
రెండు స్లాబులకే గ్రీన్‌సిగ్నల్
కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇకపై జీఎస్టీలో 5,18 శాతం ఈ రెండు స్లాబులు మాత్రమే అమలులో ఉండనున్నాయి. కొత్త రేట్లు ఈనెల 22 నుండి అమల్లోకి రానున్నాయి. మొదట దీపావళి నుంచి అమలుపై ఆలోచించినా.. ముందుగానే అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీ పూర్తిగా రద్దు
ప్రజలకు ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది కౌన్సిల్. ఇప్పటి వరకు అమలులో ఉన్న హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. దీని వలన ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా తగ్గి,సాధారణప్రజలకుఅందుబాటులోకి రానున్నాయి. ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కౌన్సిల్ భావిస్తోంది.
లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధింపు
సాధారణ వస్తువులపై పన్నును తగ్గించినప్పటికీ, లగ్జరీ వస్తువులపై మాత్రం 40శాతం వరకు జీఎస్టీ విధించనున్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, విలాసవంతమైన వస్తువులపై ఈ పన్ను అమలు కానుంది.
కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాల ఏకాభిప్రాయంతో మద్దతు
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలకు రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయంతో మద్దతు ఇచ్చాయని చెప్పారు. అలానే ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా మాట్లాడుతూ మద్యం, పొగాకు వంటి డీమెరిట్ వస్తువులపై పన్ను పెంపు విషయంపై ఇంకా చర్చ జరగలేదని తెలిపారు. “40శాతం” కంటే ఎక్కువ పన్ను విధించాలా వద్దా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం” అని చెప్పారు. ఏది ఏమైనా పటికి జీఎస్టీ లో మార్పులు సామాన్య ప్రజలకు ఎంత ఊరట నిచ్చింది. ఈ కొత్త స్లాబు వల్ల టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ, 350 సిసి వరకు చిన్న కార్లు, టూ వీలర్స్ రేట్లు చాలావరకు తగ్గుతాయి.
Authored by: Vaddadi udayakumar