దుబాయ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై ఆంక్షలు

దుబాయ్,ఐఏషియ న్యూస్ ప్రతినిధి: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్‌ఎస్‌ఏ) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దుబాయ్ బ్రాంచ్‌పై ఆంక్షలు విధించింది.ఆన్‌బోర్డ్ కాని కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించడం, కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో లోపాల కారణంగా కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని నిషేధించింది. ఈ నిషేధం డీఎఫ్‌ఎస్‌ఏ నుంచి నోటీసు వచ్చే వరకు కొనసాగుతుంది. ఇది ఇప్పటికే సేవలు పొందుతున్న గతంలో సేవలు పొందిన కస్టమర్లకు వర్తించదని బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ సూజ్ ఏటీ1 బాండ్లను అర్హత లేని రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయించిందనే ఆరోపణలను కూడా ఎదుర్కొంటోంది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం

మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *