గుంతలు పడిన రోడ్లపై టోల్ వసూలు చేయకూడదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ,ఐఏషియ న్యూస్:గుంతలు పడిన, డ్రైవింగ్ చేయడానికి అనువుగా లేని, ట్రాఫిక్ జామ్ అయిన రహదారులపై వాహనాదారులను టోల్ చెల్లించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. త్రిస్సూర్ జిల్లాలోని పలియక్కర ప్లాజా వద్ద టోల్ వసూలును నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎస్హెచ్ఏఐ), టోల్ వసూల్ సంస్థ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది. ఈ క్రమంలో నిలిపివేసిన టోల్ వసూలు వల్ల కలిగే ఆర్థిక నష్టం కంటే పౌరుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లా ఎడప్పల్లి – మన్నుత్తి జాతీయ రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. దీంతో గంట ప్రయాణానికి కాస్త ఏకంగా 12 గంటలు పట్టింది. దీనిపై స్థానిక మీడియా సైతం పెద్దఎత్తున కథనాలు ప్రచురించింది. ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలో ట్రాఫిక్‌ను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా పరిగణించి కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు 4వారాల పాటు టోల్‌ చెల్లించవద్దని తీర్పునిచ్చింది. రహదారులు సరిగ్గా నిర్వహించకపోవడం, ట్రాఫిక్ రద్దీ కారణంగా హైవేలోకి ప్రవేశించడానికి అంతరాయం ఏర్పడినప్పుడు ప్రజల నుంచి టోల్ రుసుములు వసూలు చేయలేరని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎన్హెచ్ఏఐ, టోల్ వసూల్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. కేరళ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

హైకోర్టు వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు

టోల్ చెల్లించే పౌరుడు మంచి రోడ్లను డిమాండ్ చేసే సంబంధిత హక్కును పొందుతాడనే కేరళ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. టోల్ చెల్లించే వారి హక్కు రక్షించకపోతే ఎన్ హెచ్ఏఐ లేదా లేదా దాని ఏజెంట్లు టోల్ చెల్లించమని డిమాండ్ చేయలేరని స్పష్టం చేసింది.హైకోర్టు వాదనతో మేము ఏకీభవించకుండా ఉండలేం. చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం ప్రజలు టోల్ ఫ్రీ రుసుము చెల్లించాల్సిన బాధ్యత వారి రహదారి వినియోగం అడ్డంకులు లేకుండా ఉంటుందనే హామీపై ఆధారపడి ఉంటుంది. ఎన్ హెచ్ఏఐ లేదా దాని ఏజెంట్లు అలాంటి సదుపాయాలను వినియోగదారుడి కల్పించడంలో విఫలమైతే ప్రజల చట్టబద్ధమైన అంచనాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇది టోల్ వ్యవస్థ పునాదిని దెబ్బతీస్తుంది. పౌరులు తాము ఇప్పటికే పన్నులు చెల్లించిన రోడ్లపై ప్రయాణించడానికి స్వేచ్ఛగాఉండాలి.కాలువలు,గుంతల్లోప్రయాణించడానికి మరిన్ని పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Authored by: Vaddadi udayakumar

About admin

Check Also

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 68వ రోజు ప్రజాదర్బార్

సమస్యలు విన్నవించేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన మంత్రి లోకేష్ విజ్ఞప్తులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *