అమరావతి,ఐఏషియ న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 1,711 జూనియర్ లైన్మెన్, 800 ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జెన్కో, ట్రాన్స్కో వివిధ కేడర్లలో 7,142 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకేసారి కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేస్తే సంస్థలపై ఆర్థిక భారం పడదని అధికారులు సీఎంకు వివరించారు.సాధ్యమైనంత త్వరగా 2,511 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించగా, త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అని చెప్పాలి.
Authored by: Vaddadi udayakumar