- మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెండ్ల ఎదగడం నా చలవే
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
- ఐఏషియ ఏపీ చీఫ్ బ్యూరో,ఐఏషియ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధి టీడీపీ హయాంలోనే తన వల్లే జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్‌ను మొట్టమొదటిగా హైదరాబాద్‌కు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ల అక్కడి వరకు ఎదగడానికి నేను వేసిన బాటే మూలం” అని చెప్పారు. కాగా కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన ముఖ్యమంత్రి.గూడెంచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆటోలో ప్రజల మధ్య ప్రయాణించిన చంద్రబాబు.ఆటో కార్మికుడికి స్వయంగా బాడుగ చెల్లించారు.అనంతరం ప్రజావేదిక వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు.
వైసీపీపై మండిపడ్డ చంద్రబాబు
బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరంగా మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించడాన్ని తప్పుపట్టారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తేకట్టడిచేయాలి.నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు.అలాగే జగన్ లాంటి నాయకులు రాజకీయాల్లో అవసరమా?” అని ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగితే మాపై విషం చిమ్మారు. జగన్ పత్రికలో అసత్యాలు రాశారు.మభ్యపెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తప్పవు అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ప్రతిచోట డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని,అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కడప స్టీల్‌ప్లాంట్ విషయాన్ని ప్రస్తావించిన సీఎం, 2028 డిసెంబరు నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. “స్టీల్‌ప్లాంట్‌తో జమ్మలమడుగు అభివృద్ధి చెందుతుందని ఇది వాస్తవిక ప్రగతి ప్రతీక” అని అన్నారు.
గండికోట, పర్యాటకం అభివృద్ధిపై ప్రకటన
అమెరికాలో గ్రాండ్ క్యానియన్ ఉంటే, మనకు గండికోట ఉంది. దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే పనులు మొదలుపెడుతున్నాం.అక్కడ రూ.85 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం” అని ప్రకటించారు.గతంలో ఈ ప్రాజెక్ట్‌ను ఎన్టీఆర్ ప్రారంభించగా, తానే పూర్తి చేశానని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో పదికి పదిసీట్లుగెలవాలన్నదే మా లక్ష్యం.ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
Authored by: Vaddadi udayakumar