కేదార్నాథ్,ఐఏషియన్ న్యూస్:కేదార్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది.రుద్ర ప్రయాగ్ జిల్లాలోని గౌరికుండ్ వద్ద భారీగా విరిగిపడుతున్న కొండ చరియలు.యాత్రికుల భద్రత దృష్ట్యా కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
Authored by: Vaddadi udayakumar