అమరావతి,ఐఏషియ న్యూస్: నేపాల్ లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం పై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు.బుధవారం ఉదయం 10 గంటలకు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.రియల్ టైమ్ గవర్నెన్స్ వేదిక గా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు.సంబంధిత మంత్రులు,శాఖల అధికారులతో సమన్వయం చేయనున్న మంత్రి నారా లోకేష్.సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్,నంబర్ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్న మంత్రి నారా లోకేష్.నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేష్.
Authored by: Vaddadi udayakumar